ఎంపీటీసీని పరామర్శించిన బలరాం జాధవ్.

నేరడిగొండసెప్టెంబర్26(జనంసాక్షి):
మండలంలోని తేజపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా హైదారాబాద్ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చారన్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ సోమవారం రోజున వారిని కలిసి పరామర్శించారు.త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్ని ఇచ్చారు.బలరాంతో పాటు బీజేపీ మండల అధ్యక్షులు హీరాసింగ్ ప్రధాన కార్యదర్శి సాబ్లే సంతోష్, ప్రశాంత్ చొక్కపెల్లి రాములు గట్టు నారాయణ రాజశేఖర్ శ్రీధర్ తదితరులు ఉన్నారు.