ఎంపైర్‌ స్టేట్‌ భవనం వద్ద ఆగంతకుని కాల్పులు

ఇద్దరు మృతి.. తొమ్మిదిమందికి గాయాలు
న్యూయార్క్‌, ఆగస్టు 24 (జనంసాక్షి): అమెరికా మరోసారి ఉలిక్కిపడింది..కాల్పుల మోతతో దద్దరిల్లింది…అమెరికాలో విస్తరిస్తున్న ప్రమాదకర గన్‌ కల్చర్‌కు ఈ ఘటన అద్దం పడుతోంది..వరుసగా రెండు నెలల్లో ఇది మూడో సంఘటన..శుక్రవారం ఉదయం న్యూయార్క్‌ నగరంలోని ఎంపైర్‌ భవనం వద్ద ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు..ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో తొమ్మిది మంది గాయపడ్డారు..కాల్పులు ప్రారంభమైన కాసేపటికి అక్కడకు చేరుకున్న పోలీసులు అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం విఫళమవడంతో అతడ్ని కాల్చిచంపారు. కాల్పులు జరిగిన వ్యక్తిని జెఫ్రీ జాన్సన్‌గా గుర్తించినట్లు న్యూయార్క్‌ పోలీస్‌ చీఫ్‌ రే కెల్లీ తెలిపారు.