ఎంబీబీఎస్ పార్ట్-2 ఫలితాల విడుదల
విజయవాడ: ఆగస్టులో జరిగిన ఎంబీబీఎస్ చివరి ఏడాది పార్ట్ -2 ఫలితాలను విడుదల చేసినట్టు ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యలయం తెలిపింది. యూనివర్శిటీ వెబ్‌సైట్లో ఫలితాలను వీక్షించవచ్చు. బీడీఎస్ ఫైనల్ ఫలితాలను కూడా విడుదల చేసినట్టు యూనివర్శిటీ అధికారులు తెలిపారు.