ఎంసెట్‌ ర్యాంకుల విడుదల

హైదారాబాద్‌ (జనంసాక్షి) :  హైదారాబాద్‌ ఎసెట్‌ ర్యాంకుల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామెదర రాజనర్సింహ విడుదల చేశారు.ఎంసెట్‌ (ఇ0ంజనీరింగ్‌) విభాగంలో చింత నితీష్‌ చంద్ర మొదటి ర్యాంకును సాధించాడు.ఈ విద్యార్థి 150కి 149 మార్కులు వచ్చాయి.రెండో ర్యాంకు ఎంవీబీ మనోజ్‌కుమార్‌ ,మూడోర్యాంకు రూపేష్‌ ,నాలుగోర్యాంకు ధీరజ్‌ రెడ్డిలకు వచ్చాయి.ఇంజనీరింగ్‌ విభాగంలో 73.18 శాతం మెడికల్‌ లో 85.57 శాతం ఉత్తీర్ణత నమోదయింది.కృష్ణా జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతం ఇంజనీరింగ్‌ విభాగంలో 97.29 శాతం మెడికల్‌ విభాగంలో 98.33శాతం సాధించింది.