ఎట్టాకేలకు ముగిసిన ఇంజినీరింగ్‌ ఫీజుల విచారణ

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల వ్వవహారం గందరగోళంగా మారిందటూ దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు విచారణను ముగించింది. ఎంసెట్‌లో కౌన్సిలింగ్‌కు సంబంధించిన షెడ్యూలును గత శనివారమే నోటిఫికేషన్‌ ద్వారా జారీ చేసినట్లు ఏఎఫ్‌ఆర్‌సీ కోర్టుకు తెలిపింది. వరుసగా సెలవులు రావటం వల్ల ఫీజులపై ఓ నిర్ణయానికి రాలేకపోయామని కోర్టుకు విన్నవించింది. దీనిపై సీల్డ్‌ కవర్‌లో నివేదికను సమర్పించటంతో సమ్మతించిని న్యామూర్తి ఈ కేసులో విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించారు.