ఎన్జీరంగ వర్శిటీలో తెలంగాణకు మళ్లీ అన్యాయం

హైదరాబాద్‌: ఎన్జీరంగా యూనివర్శిటీ విషయంలో తెలంగాణకు మళ్లి అన్యాయం జరిగింది. గత కొంత కాలంగా వర్శిటీకి తెలంగాణ వ్యక్తిని వీసీగా నియమించాలని తెలంగాణ వాదులు ఆందోళన చేస్తున్న సర్కారు పట్టించుకోలేదు. యూనివర్శిటీ వీసీగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన డాక్టర్‌ పద్మరాజ్‌ను నియమిస్తూ గవర్నర్‌ నరసింహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.