ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ను సందర్శంచిన టిబెట్‌ ఎంపీల బృందం

హైదరాబాద్‌: టిబెట్‌ నుంచి వచ్చిన ఎంపీల బృందం ఈ రోజు నగరంలో తెదేపా కార్యాలయమైప ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ను సందర్శంచింది. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి టీబెట్‌ ఎంపీలు నివాళులర్పించారు. టిబెటన్లపై చైనా చేస్తున్న హింసను ప్రపంచ దృష్టికి తీసుకువచ్చేందుకు పార్టీల మద్దతు కోరుతున్నామని. అందుకే 9 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నామని టిబెట్‌ ఎంపీలు తెలియజేశారు. ఈ నెల 10న హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద తాము తలపెట్టిన దీక్షకు మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీని కోరినట్లు వారు తెలియజేశారు. టిబెట్‌ ఎంపీల దీక్షకు సంఘీభావం తెలుపుతామని తెదేపా నేత పెద్దిరెడ్డి తెలియజేశారు.

తాజావార్తలు