ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ లకు ఈవీఎంలు స్టేషనరీ తరలింపు-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల నడిగడ్డ, నవంబర్ 29 జనం సాక్షి.
ఈనెల 30న జరిగే సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషనులకు ఈవీఎంలు, సామగ్రి తరలించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. బుధవారం గద్వాల లోని ప్రియదర్శని డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంను సందర్శించారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది 303 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని 34రూట్లకు ఆయా సెక్టరియాల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్ల ల తో తరలించినట్లు తెలిపారు. పోలింగ్ అధికారులు వివి ప్యాట్, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లను, పోలింగ్ సామాగ్రి చెక్ చేసుకోవాలని సిబందికి ఆదేశించారు. కంట్రోల్ యూనిట్ ఆన్ చేసి, అభ్యర్థుల లిస్టు కరక్ట్ గా ఉందా లేదా అన్నది చెక్ చేయాలన్నారు.
ఈనెల 30న ఉదయం 7 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటర్లు ఏపిక్ కార్డు అందని పక్షంలో 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ప్రజలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, చీర్ల శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.