ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి


-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, మార్చి 12 (జనం సాక్షి,);
ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు ఆదేశించారు.ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గోని ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 877 ఓటర్లు కలవు ,11 పోలింగ్ కేంద్రాలైన గద్వాల లోని మహారాణి ఆదిలక్ష్మి డిగ్రీ కాలేజీ 482 ,ధరూరు జిల్లా పరిషత్ హైస్కూల్ 40, గట్టు జిల్లా పరిషత్ హైస్కూల్ 12 , మల్దకల్ జిల్లా పరిషత్ హైస్కూల్ 22 ,వడ్డేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ 45 , అయిజ జిల్లా పరిషత్ హైస్కూల్ 76 ,రాజోలి జిల్లా పరిషత్ హైస్కూల్ 24 అలంపూరు జిల్లా పరిషత్ హైస్కూల్ 60 ,ఇటిక్యాల జిల్లా పరిషత్ హైస్కూల్ 54 , మానవపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ 33 , ఉండవల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ 29 మంది ఓటర్లు ఉన్నట్లు, 11 పోలింగ్ స్టేషనులు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుండి సాయత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు . ఈ ఎన్నికలలో పిఓ లు 11, ఏపిఓ లు 11 , ఓ పి ఓ లు 12 ,మైక్రో అబ్జర్వర్లు 11 ,సెక్టోరియల్ ఆఫీసర్స్ 5, రూట్ ఆఫీసర్స్ 5 , మొత్తం 55. నోడల్ అధికారి, డిస్ట్రిబ్యూషన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ,సంబంధిత అధికారులు పాల్గొంటారని తెలిపారు. పోలింగ్ లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలని, ఒట్టింగ్ కంపేర్ట్మెంట్, కనపడకుండా లైవ్ వెబ్ క్యాస్టింగ్ చెక్ చేసుకోవాలి. బ్యాలట్ పేపర్ అందించడం, సీరియల్ నెంబర్ వారీగా ఎటువంటి సమస్య రాకుండా చూడాలని,పిఓ డైరీ, పేపర్ సీల్ అకౌంట్ అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలని, పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలట్ బాక్స్ లు ఏజంట్ల తో సంతకం తీసుకొని హైదరాబాద్ కు చేర్చే వరకు మైక్రో అబ్జార్వర్స్ పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు .ప్రతి పోలింగ్ స్టేషన్ కు ఒక వీల్ చైర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ ,ఆర్డిఓ రాములు , ఎస్సి కార్పోరేషన్ ఈ డి రమేష్ బాబు ,గోవిందు నాయక్ సంబంధి తఅధికారులు ,
పోలింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.