ఎన్సీపీ మంత్రుల రాజీనామాలు

ముంబయి: ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్‌ పవార్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టింది. ఎన్సీపీ మంత్రులు కూడా అజిత్‌ బాటే పట్టారు. తమ రాజీనామాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మధుకర్‌ పిచడ్‌కు సమర్పించారు. అందరు ఎన్సీపీ మంత్రులు తనకు రాజీనామాలు సమర్పించారని పిచడ్‌ తెలిపారు. శరద్‌ పవార్‌ ప్రస్తుతం ఢిల్లీలో లేరని ఆయనతో మాట్లాడిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన అన్నారు.