ఎన్‌ఏసీఎల్‌ పరిశ్రమ ముందు ప్రజల ఆందోళన

శ్రీకాకుళం: ఇచ్చెర్ల మండలంలోని హరినామ్‌అక్కివలన పంచాయితీ పరిధిలోని నాగార్జున అగ్రికెమ్‌ పరిశ్రమ గేటు ముందు పరిసర గ్రామాల ప్రజలు, పరిశ్రమ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు ఉదయం నుంచే ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ మూసివేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు, జిల్లా  కలెక్టర్‌ వచ్చి పరిశ్రమ మూసివేతపై స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు ఆందోళన విరమించేదిలేదని వారు హెచ్చరించారు.