ఎన్‌ఐఆర్‌డీలో జిల్లా కలెక్టర్లతో భేటీ

హైదరాబాద్‌: నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో యువత ఉద్యమాల పట్ల ఆకర్షతులు కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ గ్రామీణాభివృద్ధి మండలి (ఎస్‌ఐఆర్‌డి) కార్యాలయంలో రెండురోజుల సెమినార్‌ ప్రారంభమైంది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పలువురు మాజీ ఐఏఎస్‌ అధికారులు హాజరయ్యారు. మాజీ ఐఏఎస్‌ అధికారి బీడీ శర్మ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఉద్యమాల పట్ట యువత ఆకర్షితులు కాకుండా ఉండేందుకు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ముగింపు సమావేశానికి కేంద్రమంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ హాజరవుతున్నారని ఎస్‌ఐఆర్‌డి డీజీ డాక్టర్‌ ఎంవీరావు తెలియజేశారు.