ఎన్‌ఐవో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రదర్శిన

విశాఖపట్నం: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ బంగాళాఖాతంలో అనేక వినూత్న పరిశోధనలు నిర్వహిస్తోంది. సముద్రం అటుపోటులు. సునామీ సంబంధిత సముద్ర మార్పులు వంటి అంశాలపై ఈ పరిశోధనలే జరుగుతున్నాయని ఆ సంస్థ ముఖ్య పరిశోధకుడు డాక్టర్‌ వి.ఎస్‌. ఎస్‌. మూర్తి తెలియజేశారు. నేషనల్‌ ఇస్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ పరిశోధనల్లో వినియోగించే పరికరాలను, వివిధ వ్యవస్థలను సామాన్య ప్రజానీకానికి, పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ఆవగాహన కోసం ప్రదర్శనగా ఉంచారు. సముద్రగర్భంలో విద్యుత్‌ వినియోగం, తుఫాను హెచ్చరికలు తదితర అంశాలకు సంబంధించిన పరికరాలపై ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.