ఎపిలో కాంగ్రెస్‌కు కలసిరాని కాలం

ఒంటరి పోరాటంలో నేతలు
అమరావతి,మార్చి12(జ‌నంసాక్షి):  రాష్ట్రవిభజన తరవాత రెండు రాష్ట్రాల్లో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్‌  వీధుల్లో పడుతూలేస్తూ గత వైభవం కోసం పాకులాడుతోంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడదే పరిస్థితిని కొనసాగిస్తోంది. ఎపిలో ప్రత్యేక¬దా, తెలంగాణలో ప్రాజెక్టులపై పోరు ప్రధానాంశాలుగా  పోరు సాగించి చతికిల పడ్డారు. విభజనతో ఎపిలో తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్‌ మెల్లగా పుంజుకుంటోందన్న తీరుగా ముందుకు సాగుతోంది. వైకాపా నిరంతరంగా పోరాడుతున్నా  కాంగ్రెస్‌ అంతకుమించి కార్యక్రమాలను చేస్తూనే ఉంది. గతంలో ప్రత్యేక¬దా కోసం కోటి సంతకాల సేకరణ, ధర్నాలు చేపట్టగా ఇప్పుడు మెల్లగా ప్రత్యేక¬దా రాదని తేలిపోవడం, ఇవ్వలేమని కేంద్రం ప్రకటించడంతో దానిపైనే ప్రధానంగా దృష్టి సారించింది. విభజన అపవాదు నుంచి ఏపీ కాంగ్రెస్‌ పార్టీ బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయిన ఏపి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే పార్టీని వీడారు. పిసిసి అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాల పేరుతో కదిలారు. విభజన పాపం కన్నా ప్రత్యేక¬దాను  ఆధారం చేసుకుని పోరాటాలు చేసినా ఫలించడం లేదు. ఇకపోతే  రాహుల్‌ ప్రత్యేక¬దా ఇస్తారన్న ప్రచారం చేస్తున్నా పెద్దగా స్పందన కానరావడం లేదు. అందుకే ప్రధానంగా రైతుల సమస్యలను భుజానకెత్తుకున్నారు.  అయితే టిడిపితో పొత్త కారణంగా కాంగ్రెస్‌కు గుర్తింపు లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో కలసి పోటీ చేయకకున్నా విడిగా పోటీ చేసినా పెద్దగా కాంగ్రెస్‌ లబ్ది పొందుతుందన్న భావన లేదు. రాహుల్‌ ప్రత్యేక¬దా హావిూ కూడా పెద్దగా ఫలితం ఇచ్చేలా కనిపించడం లేదు.