ఎమ్మార్పీఎస్ దాడుల వెనుక టీఆర్ఎస్ హస్తం : ఎర్రబెల్లి
ఎమ్మార్పీఎస్ దాడుల వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. తెలంగాణాలో ఎస్సీ రిజర్వేషన్లకు తాము మద్ధతు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీకి మద్ధతు ఇస్తున్నామన్నారు. సీబీఐ దాడుల్లో లభ్యమైన సొమ్మంతా రైతులదేనని ఆయన పేర్కొన్నారు. టీడీపీ సభను విజయవంతం చేసిన వారందరికీ ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.