ఎమ్మెల్యేల ఆస్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పెడతా: మనోహర్‌

హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేలోగా ఎమ్మెల్యేల ఆస్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పెడతామని సభాపతి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ నెల 16న ఉదయం 11గం.కు జరిగే శాసనసభ వ్వవహారాల సలహా సంఘం సమావేశంలో వర్షాకాల సమావేశాల అజెండాను ఖరారు చేస్తారు. శాసనసభ ఆవరణలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సహా అందరూ అంగీకరించాలని చెప్పారు. అందరితో చర్చించి అంబేద్కర్‌ విగ్రహం ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటు చేయాలనేది నిర్ణయిస్తామన్నారు.