ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలి

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తనను హత్య చేయించేందుకు ఓ ముఠాకు సుఫారీ ఇచ్చారని హైదరాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముద్దగోని రామ్మోహన్‌గౌడ్‌ ఆరోపించారు. మొత్తం రూ.2కోట్లతో ఒప్పందం కుదుర్చుకుని ముందస్తుగా రూ.50లక్షలు చేల్లించారని ఆరోపించారు. ఆ ముఠా తనను చంపేందుకు రెక్కీ కూడా నిర్వహించిందని, ముఠాసభ్యులతో పరిచయమున్న శ్రేయోభిలాషుల ద్వారా తనకు విషయం తెలిసిందన్నారు. వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్‌ చేయాలన్నారు.