ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేదిలేదు :

మన్సూరాబాద్ డివిజన్ తెరాస అధ్యక్షుడు  జక్కిడి మల్లారెడ్డి
కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డిపై నిప్పులు చెరిగిన జక్కిడి మ
ఎల్బీనగర్ (జనం సాక్షి  )  మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై పసలేని ఆరోపణలు చేస్తున్నారని టిఆర్ఎస్ పార్టీ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి ఆరోపించారు.  మన్సూరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జక్కిడి మల్లారెడ్డి మాట్లాడారు. కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, ప్రతిసారీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిందిపోయి, 35 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై విమర్శలు గుప్పించడం సరికాదని ఆయన హితవు పలికారు. అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేపై బురద జల్లాలని చూడడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై, టిఆర్ఎస్ నాయకులపై   నిరాధారమైన ఆరోపణలు  చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు జగదీష్ ప్రసాద్ గౌడ్, రుద్ర యాదగిరి,  జగదీష్ యాదవ్,  సోమ్రెడ్డి   రాజిరెడ్డి   ,బత్తుళ దుర్గారావు  భాస్కర్ యాదవ్ గోపు శివ, దుర్గయ్య   తదితరులు ఉన్నారు.