ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని గెలిపించాలి

ఆదిలాబాద్‌ , అక్టోబర్‌ 29 : రాబోయే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదులను గెలిపించాలని టిఆర్‌టియు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శి దేవేందర్‌, సుదర్శన్‌లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఈ ఎన్నికల్లో తెలంగాణ వాదానికి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉపాధ్యాయుల పేర్లు నమోదు చేసి తెలంగాణ వాదుల గెలుపుకు కృషి చేయడం, నవంబర్‌ 1వ తేదీన నల్లబాడ్జీలు, జెండాలతో నిరసనలు తెలియజేయాలని, విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, పదో పిఆర్‌సిని వెంటనే నియమించాలని తదితర అంశాలను సమావేశంలో తీర్మానించినట్లు వారు పేర్కొన్నారు.