ఎమ్మేల్యే ఎన్నిక చెల్లదని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: విజయనగరం జిల్లా కురుపాం కాంగ్రెస్‌ ఎమ్మేల్యే జనార్దన్‌ దాట్రాజ్‌ ఎన్నిక చెల్లదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనార్దన్‌ ఎస్టీ కాదంటూ తెదేపా అభ్యర్థి జయరాజ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జనార్దన్‌ దాట్రాజ్‌ గిరిజనుడు కాదంటూ మంగళవారం తేల్చి చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లడానికి జనార్దన్‌కు నాలుగు వారాల సమయాన్నిచ్చింది.