ఎర్రచందనం పట్టివేత
ఖాజీపేట : కడప జిల్లా ఖాజీపేట మండలం ఏటూరు వద్ద 110 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు. రూ. 50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. లారీలో వీటిని తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో పట్టుకున్నాట్లు పోలీసులు తెలిపారు. వాహనంతోపాటు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.