ఎల్వీ సుబ్రహ్మణ్యం పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌ : ఎమ్మార్‌ కేసులో ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నాంపల్లి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనపై మోపిన అభియోగాలు నిరాధారమైనవని, తనపై సీబీఐ పెట్టిన కేసును ఎత్తివేయాలని సుబ్రహ్మణ్యం పెట్టుకున్న పిటిషన్‌ను శుక్రవారం కోర్టు కొట్టేసింది. విచారణ ఎదుర్కోవాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. దీంతో సుబ్రహ్మణానికి ఇక కోర్టు గుమ్మం తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.