ఎస్పీని సురక్షితంగా విడుదల చేయించే దిశగా ప్రయత్నాలు

హైదరాబాద్‌: ట్రాన్స్‌ఫోర్ట్‌ ఎస్పీ లక్ష్మీనారాయణను నిర్బంధించిన హెడ్‌ కానిస్టేబుల్‌ శర్మ మూడు డిమాండ్ల పట్ల సనుకూలంగా స్పందిస్నుతన్నట్లు హోంమత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శర్మ ఆరోపణలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని సబిత చెప్పారు. పోలీస్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ సంస్థ ప్రక్షాళనకు సానుకూలంగా ఉన్నామని, పీటీవోలో ఖాళీగా ఉన్న డ్రైవర్ల పోస్టులు భర్తీ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఎస్పీని నర్బింధించిన స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఎస్పీ లక్ష్మీనారాయణను సురక్షితంగా విడుదల చేయించే దిశగా వారు ప్రయత్నాలు ప్రారంభించారు.