ఎస్పీవై రెడ్డి రాజీనామా ఉపసంహరణ

హైదరాబాద్‌: ఆల్మట్టినుంచి రాష్ట్రానికి నీరు విడుదల చేసినందుకు తన రాజీనామా ఉపసంహరించుకుంటున్నానిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలియజేశారు. రెండు మూడు రోజుల్లో శ్రీశైలం జలిశయానికి నీరు చేరుతుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. అర టీఎంసీ నీటిని శ్రీశైలం నుంచి దిగువకు తాగు, సాగు నీటి అవసరాలకు విడుదల చేయడానికి సీఎం విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించామని ఆయన వెల్లడించారు.