ఎస్సీ,ఎస్టీల పదోన్నతుల బిల్లు ప్రతిపాదనను కేంద్రమంత్రివర్గం ఆమోదం

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ,ఎస్టీలకు పదోన్నతులు కల్పించేందుకు వీలుగా ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టనుంది. ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల బిల్లు ప్రతిపాదనను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. అనంతరం బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.