ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక పకడ్బందీ అమలుకు సలహాల స్వీకరణ

కరీంనగర్‌, జూలై 29 (జనంసాక్షి) : ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయుటకు ఎస్సీ ఎస్టీ, దళిత  సంఘాల నాయకులు సూచనలు ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డీ శ్రీధర్‌ బాబు అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో ఆడిటోరియంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎస్సీ, ఎస్టీ దళిత సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై సూచనలు స్వీకరిం చారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమ లుపై ఉప మఖ్యమంత్రులు అధ్యక్షతన సబ్‌ కమిటీ నియమించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో దళిత సం ఘాల నాయకుల సూచనలు సలహాలు స్వీకరిస్తుందన్నారు. ఉప ప్రణాళిక కేటాయించిన నిధులు దారి మళ్లకుండా పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీలకు వ్యక్తిగత సామాజికంగా లబ్ధి చేకూరేలా నిధులు పూర్తి స్థాయిలో  వెచ్చించేలా నిర్మాణాత్మకంగా సూచనలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో సూచనలు అందిం చకలేక పోయిన వారు రాత  పూర్వకంగా తమ సలహాలు ఇవ్వాలని వారు కోరారు.  ఉప ప్రణాళిక అమలకు చట్ట బద్ధత కల్పించుటకు ప్రభుత్వం ఉప ముఖ్య మంత్రులు అధ్యక్షతన ఉపకమిటీ నియమిం చిందన్నారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ధర్మపురి శాసన సభ్యులు మాట్లాడుతూ దళితులకు కేటాయించిన 23 శాతం నిధులు ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తామన్నారు.  జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలకు వారికి కేటాయించిన విధులు నూరుశాతం ఖర్చు చేసేలా  సూచనలు ఇవ్వాలన్నారు. సమావేశంలో వివిధ నాయ కుల సంఘ నాయకులు అంద జేసిన సూచనలు ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో దళిత సంఘనాయకులు రాజవీరు, స్వామి, మాజీ జడ్పీటీసీ బోయినపల్లి శంకరయ్య, కిషన్‌ నాయక్‌, పలువురు సూచనలు తెలి పారు.  ఈ కార్యమ్రంలో అదనపు జేసీ సుందర్‌అబ్నార్‌ కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ రవీందర్‌రావు,  జడ్పీ చైర్మన్‌ అడ్లురి లక్ష్మన్‌ కుమార్‌, ఓఎస్‌డీ సుబ్బారాయుడు, సాంఘీక సంక్షేమ శాఖ జేడీ నాగేశ్వరరావు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి రాములు పలువురు అధికారులు  పాల్గొన్నారు.