ఎస్సీ, ఎస్టీ నిధులను ఖర్చు చేయని మాట వాస్తవమే:సీఎం

హైదరాబాద్‌: ఈ రోజు ఎస్సీ ఎస్టీల ఉపసంఘం ఉప ప్రణాళికపై తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు సేవ చేసేది కాంగ్రెస్‌ పార్టీయేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్సీ నిధులను ఖర్చు చేయని మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఇక నుంచి స్సీ ఎస్సీ నిధుల కోత ఉండది అన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని ఉప ప్రణాళికతో వారికి మేలు జరుగుతుందని అన్నారు.