ఎస్సీ, ఎస్టీ పదోన్నతులు తొలగిన అడ్డంకులు
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల అడ్డంకులను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఇందుకు పచ్చజెండా వూపింది. దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.