ఎస్సీ వర్గీకరణ పై అభిప్రాయాల సేకరణ

ముకుల్‌ వాస్నిక్‌
హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలను కోరామని కేంద్ర సామాజిక న్యాయమంత్రి ముకుల్‌వాస్నిక్‌ తెలిపారు. కేంద్ర పరిధిలో ఉన్న ఈ అంశం పై అన్నీ రాష్ట్రాలనుంచి సమాధానాలు అందాకా ఏం చేయాలన్న దాని పై పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు.