ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం ఎత్తివేత

రోజుకు ఐదు ఎస్‌ఎంఎస్‌ల కంటే ఎక్కువ పంపకూడదన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం గురువారం ఎత్తివేసింది. అసోంలో మత ఘర్షణలు చెలరేగడానికి ఈ ఎస్‌ఎంఎస్‌లే మూల కారణమని గుర్తించిన కేంద్రం ఎస్‌ఎంఎస్‌లపై నిషేధం విధించింది. వాటిపై విచారణ జరిపిన ప్రభుత్వం అవి దొంగ ఎస్‌ఎంఎస్‌లుగా గుర్తించి నేషేధం ఎత్తివేసింది. అసోంలో చెలరేగిన అల్లర్ల కారణంగా భయభ్రాంతులకు గురై ఈ శాన్య ప్రాంతాలవారు తమ, తమ ప్రాంతాలకు తరలిపోయిన విషయం తెలిసిందే.