ఎస్‌బీహెచ్‌లో చోరీ

జక్రాస్‌పల్లి: మండలంలోని తొర్లికొండ గ్రామంలో ఎస్‌బీహెచ్‌ బ్యాంకులో బుధవారం చోరీ జరిగింది. దొంగలు బ్యాంకు షట్టర్‌ను పైకిలేపి లోపలకు చొరబడి అక్కడేఉన్న కంప్యూటర్‌ మానిటర్లను ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల ధ్వంసం చేశారు. బ్యాంకు లాకర్‌ను తెరవటానికి ప్రయత్నించినా ఆది తెరుచుకోలేదు. జక్రాన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.