ఏఆర్‌ కానిస్టేబల్‌ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు కానిస్టేబుల్‌ ఒకరు ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డారు. రమేష్‌ అనే కాని స్టేబుల్‌ పోలీసు హెడ్‌ క్వార్టర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో తోటి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారుల వేధింపులే ఆత్మహత్మకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.