‘ఏటిగడ్డ’ రైతులతో సర్కారు చర్చలు
భూములిచ్చేందుకు అంగీకరించారు
మంత్రి హరీశ్ వెల్లడసిద్ధిపేట,జూలై 12 (జనంసాక్షి) :
మల్లన్న సాగర్ భూ సేకరణ వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో మంత్రి హరీష్ రావు విజయం సాధిం చారు. విపక్షాలు పనిగట్టుకునిచేస్తున్న దుష్పచ్రారాన్ని తిప్పికొ ట్టడంతో పాటు రైతులతో చర్చించి వారికి విషయలు వివరిం చారు. దీంతో ఏటిగడ్డ కృష్ణాపూర్ గ్రామస్తులు మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌కు తమ భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులతో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం గ్రామస్తులతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. జీవో నం 123 ప్రకారం భూముల ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ… ఏటిగడ్డకిష్టాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని వెల్లడించారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్‌లో పర్యటిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో గ్రామస్తులు మంగళవారం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ భూములను ఇస్తున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు. సిఎం కెసిఆర్‌పై నమ్మకం ఉందని వెల్లడించారు. గ్రామస్తుల నిర్ణయంపై మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ ఎకరాకు రూ. 6 లక్షల పరిహారంగా ఇవ్వనున్నట్లు తెలిపిన మంత్రి కొత్తగా నిర్మించబోయే గ్రామాన్ని దత్తత తీసుకుంటామని పేర్కొన్నారు. 123 జీవో ప్రకారం పరిహారం తీసుకోవడానికి మల్లన్న సాగర్ ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు ఒప్పుకున్నారని అన్నారు. మంత్రి హరీష్ రావు తో గ్రామస్తులు చర్చలు జరిపారు. ఈ భేటీలో గ్రామస్తులు ఓ అంగీకారానికి వచ్చారు. అంతేకాదు ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఊరుకు ఊరు నిర్మించి ఇస్తామని ఆయన ఈ సందర్భంగా ఏటిగడ్డకిష్టాపూర్ వాసులకు హావిూ ఇచ్చారు. అలాగే ముంపు గ్రామాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. విద్యావైద్యరంగాలను విస్తరిస్తామని అన్నారు.కొన్ని రోజులుగా ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మంత్రితో చర్చల తరవాత తమకు భరోసా కలిగిందని రైతులు అన్నారు. ి