ఏటీపీ వరల్జ్‌ టూర్‌ సెవిూస్‌లో ఫెదరర్‌

లండన్‌,నవంబర్‌ 9:ఏడాది చివరి టోర్నీ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో మాజీ నెంబర్‌ వన్‌ రోజర్‌ ఫెదరర్‌ జోరు కొనసాగుతోంది. తాజాగా ఫెదరర్‌ 6-4 , 7-6 తేడాతో స్పెయిన్‌కు చెందిన డేవిడ్‌ ఫెర్రర్‌పై విజయం సాధించాడు. ఈ విజయంతో ఫెడెక్స్‌ సెవిూస్‌కు దూసుకెళ్ళాడు. టోర్నీ ప్రారంభం నుండీ తనదైన ఆటతీరుతో అదరగొడుతోన్న స్విస్‌ థండర్‌ ఫెర్రర్‌పై విజయం కోసం రెండు గంటలపాటు శ్రమించాడు. మ్యాచ్‌ తొలి సెట్‌లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన ఫెదరర్‌కు రెండో సెట్‌లో మాత్రం పోటీ ఎదురైంది. ఫెర్రర్‌ అనూహ్యంగా పుంజుకుని సెట్‌ గెలిచేలా కనిపించాడు. ఈ సెట్‌ టై బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో ఫెదరర్‌దే పై చేయిగా నిలవడంతో ఫెర్రర్‌కు ఓటమి తప్పలేదు. ఈ సీజన్‌లో ఫెదరర్‌కు ఇది 70వ విజయం. మరోవైపు అర్జెంటీనా ఆటగాడు డెల్‌పొట్రో 6-0 , 6-4 తేడాతో సెర్బియాకు చెందిన టిప్సారివిచ్‌పై విజయం సాధించాడు. తద్వారా సెవిూస్‌ అవకాశాలు సజీవంగా ఉంచుకున్నాడు.