మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు


` భారీగా దాఖలు చేసిన అభ్యర్థులు
సాయంత్రం క్యూలో ఉన్న వారికి అనుమతి
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆఖరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్‌ల దాఖలుకు గడువు మగియగా.. అప్పటికే క్యూలైన్‌లలో ఉన్నవారు నామినేషన్‌లు వేసేందుకు అనుమతించారు. శనివారం అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్‌ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3 వరకు గడువు విధించారు. కాగా ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. మొత్తం 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 13న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫిర్యాదులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ’టీఈ పోల’ మొబైల్ యాప్ ఏర్పాటు చేసింది. వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదులకు అవకాశం కల్పించినట్టు ఎసఈసీ తెలిపింది. చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సాయంత్రం 5 గంటలకు నామినేషన్ గడువు మగియగా.. అప్పటి వరకు క్యూలైన్‌లో ఉన్న వారిని నామినేషన్ వేసేందుకు అనుమతించారు. శనివారం అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.అదే రోజు ్గªనైల్ అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తుంది ఈసీ. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 3 వరకు విత్ డ్రాలు నిర్వహించి అదే రోజు అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందే ప్రచారం ముగుస్తుంది. అంటే వచ్చే ఫిబ్రవరి 9వ తేదీన ప్రచారం బంద్ అవుతుంది. ఈ లెక్కన అభ్యర్థులు కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది.చివరిరోజు గజ్వెల్‌లో బిజెపి అభ్యర్థి నామినేషన్‌లో మెదక్ ఎంపి రఘునందన్ రావు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.