మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించిన సర్పంచ్

మంథని, (జనంసాక్షి) : మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్లో శుక్రవారం మహాత్మా గాంధీ విగ్రహానికి గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఫిక్ సోహెల్, మాజీ మండల పరిషత్ కో అప్సన్ సభ్యులు ఎమ్. డి ముస్తాక్, హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు నారపల్లి సతీష్ గౌడ్, వార్డు సభ్యులు మేరుగు కుమార్, నాయకులు నగునూరి నర్సయ్య గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.



