ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం

` కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది
` దేశంలో భూసంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకష్ణారావు
` ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య ఉండాలని మాజీ సీఎం వైయసఆర్
` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
రంగారెడ్డి(జనంసాక్షి):కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తో పాటు యావత్ క్యాబినెట్ ఆలోచన చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజక వర్గంలో అల్పాహార పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే ప్రారంభించామని వివరించారు. మా సంకల్పం గొప్పది ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తే, అన్ని వనరులు సమకూరితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం పథకం ప్రవేశపెడతామని తెలిపారు. ఎదిగే వయసులో పిల్లలకు సరైన ఆహారం లేక పరిపూర్ణంగా ఎదగలేక పోతున్నారనే ఆలోచనతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తుందని తెలిపారు. కామన్ స్కూల్ విధానం ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబం గా ఎదుగుతుంది చిన్ననాటి నుంచే అందరం కలిసిపోయాం అనే భావన కులం, మతం, ధనిక , పేద తేడా లేదన్న నిర్మాణాత్మక ఆలోచన సమాజంలో పెరుగుతుందనే ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొట్టమొదటిసారి ఒక్కో పాఠశాలను 25 ఎకరాలు విస్తీర్ణంలో 200 కోట్ల బడ్జెట్ తో రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజక వర్గాల్లో 20వేల కోట్లు వెచ్చిస్తూ ఒకేసారి నిర్మాణాలు ప్రారంభించామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడాలంటే గొప్ప మానవ వనరులు ఉండాలి, మానవ వనరులకు సానపడితేనే రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుంది అందుకు కావలసింది ఉచితంగా అందరికీ విద్య, వైద్యం ప్రజా ప్రభుత్వం ప్రధానంగా ఈ రెండు అంశాలపైనే దష్టి సారించి ముందుకు పోతుందని అన్నారు. ఈ ఆలోచనలో భాగంగానే పాఠశాల నిర్వాహకులు పిలవగానే గత సంవత్సరం జనవరి మాసంలో సీఎం రేవంత్ రెడ్డి మొగిలిగిద్ద పాఠశాలకు వచ్చి పది కోట్లు కేటాయించారని వివరించారు. ఆ నిధులతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గత పాలకులు ఐఐటీలను అనాధలుగా వదిలేస్తే మారిన కాలానికి అనుగుణంగా వాటిలో శిక్షణ ఇవ్వాలని, ఆధునిక యంత్ర పరికరాలను తీసుకువచ్చి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చి ఉపాధి పొందేందుకు అవసరమైన సిలబస్ను రూపొందించామని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఐటిఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 15 రోజుల వ్యవధిలోనే అధికారులతో నివేదిక తెప్పించుకొని డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు.హైదరాబాద్ చుట్టూ ఆధునిక ఆసుపత్రుల నిర్మాణం జరుగుతుంది, జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికరించామని వివరించారు. రాష్ట్రంలోని మహిళలందరికీ నాణ్యమైన చీరలు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి పంపిణీ చేస్తున్నాం వారిని మహాలక్ష్ములుగా గౌరవిస్తున్నామని తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దెందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాం మొదటి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామంటే అంతా నవ్వారు కానీ మేం పట్టుదలతో మొదటి ఏడాది 26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేసి ఇది సాధ్యమని నిరూపించినట్లు వివరించారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకష్ణారావు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఈ తరానికి తెలిసి ఉండకపోవచ్చు ఈ దేశంలో భూ సంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకష్ణారావు అని వివరించారు. దివంగత ముఖ్యమంత్రులు బూర్గుల రామకష్ణారావు, మర్రి చెన్నారెడ్డి తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ సత్యనారాయణ రెడ్డి, ప్రముఖ ప్రొఫెసర్ హ రగోపాల్ వంటి అనేకమంది ప్రముఖులను మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల దేశానికి సమాజానికి అందించిందని తెలిపారు. రాజు దైవంశ సంభూతుడు అన్న భావన ఒకవైపు, భూమికోసం భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం మరోవైపు కొనసాగుతున్న రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమాలు నడిపించి నిజాం వ్యతిరేక పోరాటం చేసిన గొప్ప నాయకుడు బూర్గుల రామకష్ణారావు అని తెలిపారు. బూర్గుల మొదట న్యాయవాద వత్తిని చేపట్టిన తన జీవితం ప్రజల కోసం ఉపయోగపడాలని రాజకీయాల్లోకి వచ్చారని డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్ ముఖ్యమంత్రిగా 1950` 54 మధ్యకాలంలో కౌలు గారి చట్టం తీసుకువచ్చి సాగు చేసుకునే వారికి భూమిపై హక్కులు కల్పించి దేశంలో భూసంస్కరణలకు బూర్గుల ఆధ్వర్యంలో నిలిచారని తెలిపారు. జాగిరి దారి వ్యవస్థ, వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించారని తెలిపారు. దేశంలో 1970లో తీసుకువచ్చిన భూ సంస్కరణల చట్టానికి బూర్గుల బాధ్యుడిగా నిలిచారని తెలిపారు. సాయుధ పోరాటం వంటి సమస్యలకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కారం చూపిన మహానేత బూర్గుల అని వివరించారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన మొగిలిగిద్ద పాఠశాల గొప్పది ఈ పాఠశాలలో 1952 వరకు ఉర్దూ విÖడియం లో కొనసాగగా, ఆ తరువాత తెలుగు విÖడియాను ప్రవేశపెట్టారని వివరించారు. 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విÖడియం ఉండాలని పట్టుబట్టి ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విÖడియం ప్రవేశపెట్టడంపై ఆరోజు శాసనమండలిలో చర్చ జరుగుతుండగా నాటి సీఎం వైఎస్ ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న తన వైపు చూసి మాట్లాడవలసిందిగా సూచించారని గుర్తు చేశారు. బిడ్డలు చదువుకుంటే ఉద్యోగాలు, ఉపాధి సాధిస్తారని తల్లిదండ్రులు కూలి నాలి చేసి పంపుతున్నారు తీరా ఉద్యోగం రాకపోతే వారు కూలీలుగా మారిపోతున్నారు ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లీష్ తప్పనిసరి అయింది, ప్రపంచం కు గ్రామంగా మారింది, ఇంగ్లీష్ ప్రపంచ భాష అది నేర్చుకుంటేనే ఉపాధి భవిష్యత్తు ఉంటుందని ఆనాడు సభలో తన అనుభవాలను వివరించిన విషయాన్ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ప్రొఫెసర్ హరగోపాల్ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ కష్ణయ్య అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బండారి సంతోష జిల్లా విద్యాశాఖ అధికారి సుసింధర్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్
విద్యార్థినీలతో కలిసి భోజనం, వసతి సౌకర్యాలపై ఆరా రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150 వసంతాల కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అకస్మాత్తుగా స్థానికంగా ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల వసతిగహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో, వసతి గహంలో ఉన్న సౌకర్యాల గురించి విద్యార్థినీలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినీలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థినీలతో మాట్లాడుతూ ఏ క్లాస్ చదువుతున్నారు, పాఠశాల ఎలా ఉంది, భోజన వసతులు ఎలా ఉన్నాయి, ఈ లక్ష్యంతో ప్రస్తుతం పాఠశాలలో చదువుకుంటున్నారు, పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నారు, ఆ కోరికను సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలు విÖ వద్ద ఉన్నాయి అంటూ డిప్యూటీ సీఎం విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. వసతి గహంలో బోధన, బోధ నేతర అంశాలపై నిర్వాహకులను ప్రశ్నించి పలు విషయాలు ఆరా తీశారు.



