ఏడాదికి ఆరు వంట గ్యాస్‌ సిలిండర్లను పరిమితం చేయడం అన్యాయం: చంద్రబాబు

హైదరాబాద్‌: చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం వల్ల చాలా నష్టపోతామని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పన్నుల భారం మోపి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. విద్యుత్‌ కోతల వల్ల అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. ఏడాదికి ఆరు వంట గ్యాస్‌ సిలిండర్లను పరిమితం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఈనెల ఇతర పార్టీలతో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆయన ప్రకటించారు.