ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా:చంద్రబాబునాయుడు
ప.గో:ఏపీలో నదుల అనుసంధానంతో ఏపీని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు చెప్పారు. శుక్రవారం ప.గో. జిల్లా పోలవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప.గో జిల్లాలో కాలువ పనులకు భూమిసమస్య లేదన్నారు.కాం గ్రెస్ హయాంలో పోలవరం టెండర్లు పిలిచి రద్దు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో 974 కి.మీ తీర ప్రాంతం ఉందన్నారు.ఏపీలో సహజవనరులున్నాయని బెరైటీస్ నుంచి రూ.2వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. బైరైటీస్ నుంచి రూ.2వేల కోట్లఆ దాయంవ స్తున్నట్లు తెలిపారు.వీలైనంత త్వరగా రాజధాని ప్రాంతానికి ఉద్యోగులను తరలిస్తామన్నారు. భీమవరంలో మెరైన్ యూనివర్శిటీని నెలకొల్పుతామని, భూమి లభ్యతను బట్టి పశ్చిమగోదావరిలో పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని చంద్రబాబు ప్రకటించారు.