ఏపీలో పలు చోట్ల స్వల్పంగా కంపించిన భూమి

హైదరాబాద్: ఆప్ఘన్ లో సంభవించిన భూకంపం తీవ్రతకు ఏపీలో పలు చోట్ల స్వల్పంగా కంపించింది. విజయవాడ బెంజి సర్కిల్ లో భూ ప్రకంనలు వచ్చాయి. కృష్ణా కరకట్ట ప్రాంతం,గొల్లపూడి,, భవానీపురం, విశాఖ, మధురవాడ, పీఎంపాలెం, తూ.గోవరి జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, ఏలూరు తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. కాకపోతే ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని తెలుస్తోంది. నేపాల్ లో వచ్చిన భారీ భూకంపం వల్ల భూమిలో పొరలు సర్దుకునే సమయంలో స్వల్పంగా భూ ప్రకంపనలు వస్తూ వుంటాయని జియోజికల్ అధికారులు చెప్తున్నారు.