ఏమాత్రం శబ్దం వచ్చినా ఎస్పీని పెట్రోల్‌ పోసి తగలబెడతా: కానిస్టేబుల్‌ శర్మ

హైదరాబాద్‌: తొందరపడి షట్టర్లు బద్దలుకొట్టవద్దని, ఏమాత్రం శబ్దం వచ్చినా ఎస్పీని కత్తితో పొడిచి పెట్రోల్‌ పోసి తగలబెడతానని సస్పెండైన హెడ్‌ కానిస్టేబుల్‌ శర్మ హెచ్చరించాడు. ఎస్పీని తాళ్లతో కట్టేశానని అతను తెలిపాడు. సంప్రదింపుల కోసం అధికారులు మొబైల్‌ ఫోన్‌ను షట్టర్‌ లోపలికి పంపారు. పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు అడిషనల్‌ ఎస్పీ, ఐజీపీలను సస్పెండ్‌ చేయాలని, పీటీవోకు రూ.100 కోట్లు కేటాయించాలని, పీటీవోలో మెకానిక్‌, డ్రైవర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, తనను వేధాస్తున్న అదనపు ఎస్పీ విజయ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని శర్మ డిమాండ్‌ చేస్తున్నాడు.