ఏసీబీకి అప్పగించిన తాడిపత్రి భూముల కేసు

తాడిపత్రి : అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక సంఘంలోని భూముల వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జానీచేసింది. 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. పురపాలక సంఘం ఛైర్మన్‌ వెంకటరమణ సహా బాధ్యులపై కేసు నమోదు చేయాలని ప్రభుత్వం ఏసీబీని ఆదేశించింది.