ఏసీబీ కస్టడీకి రేవంత్ రెడ్డి..

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. చర్లపల్లి జైలుకు చేరుకున్న అధికారులు రేవంత్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు సెబాస్టియన్, ఉదయసింహాలను కస్టడీలోకి తీసుకున్నారు.