ఏ.కే ఫౌండేషన్ ఆద్వర్యంలో దివ్యాంగుడికి స్టడీ మెటెరీయల్ పంపిణీ

తిరుమలగిరి( సాగర్), ఆగస్టు 25 (జనం సాక్షి):
బీసీ రిజర్వేషన్ల పితామహుడు, బీసీల ఆరాద్యులు బిందెశ్వరి ప్రసాద్ మండల్ 104వ జయంతిని పురస్కరించుకుని ఏ.కే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ , జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, రిటైర్డ్ ఎం.ఇ.ఒ జవ్వాజీ వెంకటేశం చేతుల మీదుగా అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన దివ్యాంగుడు పిల్లి బాలకృష్ణ కి పోటి పరీక్షల సంబంధించిన స్టడీ మెటెరీయల్ అందించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇవి పేదలకు ,విద్యార్థులకు, యువతకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవ చేస్తున్న కట్టెబోయిన అనిల్ కుమార్ ను ఈ సందర్భంగా వారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అర్వ అశోక్ యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి మండలి రవికుమార్ యాదవ్, డివిజన్ అసోసియేట్ అధ్యక్షుడు, కట్టబోయిన సైదులు యాదవ్, నాగార్జునసాగర్ యాదవ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, నడ్డి బాలరాజు యాదవ్ ప్రధాన కార్యదర్శి మన్నెం వెంకటేశ్వర్లు యాదవ్, నాయకులు, రాజా రమేష్ యాదవ్, రావుల శ్రీను యాదవ్, ఆవుదొడ్డి గంగరాజు యాదవ్ , కుర్ర సత్యనారాయణ,మండలి సత్యనారాయణ యాదవ్ ,కాశి యాదవ్, కిలారీ కృష్ణ యాదవ్ బూడిద గోవింద యాదవ్ పంగ లక్ష్మణ్ యాదవ్, తిరుపతి యాదవ్, మెండే సైదులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.