ఐఏఎస్‌ అధికారుల బదిలీలు

హైదరాబాద్‌:  రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్‌ అధికారులను బదీలీ చేసినట్లు  సమాచారం. మెదక్‌ జిల్లా కలెక్టరుగా ఎ. దినకరబాబు, శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా సౌరభౌగౌర్‌, గుంటూరు జిల్లా కలెక్టకుగా  సురేశ్‌కుమార్‌, కర్నూలు జిల్లా కలెక్టరుగా సి. సుదర్శన్‌రెడ్డి, ట్రాస్స్‌పోర్టు కమిషనర్‌గా అజయ్‌ జైన్‌, పంచాయ తిరాజ్‌ కమిషనర్‌గా కె. రాంగోపాల్‌, పుడ్‌ ప్రాసెసింగ్‌ కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రదీప్‌ చంద్ర, మహిళ శిశు సంక్షేమ శాఖ డైరెక్టరుగా చిరంజీవి చౌదరి, రిజిస్ట్రేషన్‌, స్టాంవ్స్‌ ఐజీగా విజయ్‌కుమార్‌ నియమితులైనట్లు తెలిసింది.