ఐపీఆర్‌లు వెల్లడించని ఐఏఎస్లఉ 127మంది

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 127మంది ఐఏఎస్‌ అధికారులు నిర్దేశిత గడువులోగా తమ ఆస్తుల వివరాలు వెల్లడించలేదని కేంద్రం తెలిపింది. వీరిలో తొలగించబడిన అధికారుల జంట అరవింద్‌, టిను జోషి కూడా ఉన్నారు. వీరిద్దరూ 1979బ్యాచ్‌ మధ్యప్రదేశ్‌ కేడర్‌ అధికారులు అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రావడంతో 2010 ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేసి రూ. 360కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. అనంతరం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం జోషి దంపతులను విధుల నుంచి తొలగించింది. 2011కి ఐపీఆర్‌లు సమర్పించి వారిలో ఈ జంటతో పాటు మధ్య ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన వారు 32మంది, ఉత్తరప్రదేశ్‌ నుంచి 16మంది పంజాబ్‌ నుంచి 14మంది, ఒడిశా నుంచి 12మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 8మంది, హర్యానా, కర్ణాటకల కేడర్‌ వారు ఏడుగురు చొప్పునే, ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు ఉన్నట్లు తాజాగా కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం తెలిపింది. గతేడాది 453మంది ఐపీఎస్‌ అధికారులు కూడా ఐపీఆర్‌లు సమర్పించలేదు.