ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి.

హైదరాబాద్‌: ఎనిమిది మంది ఐసీఎస్‌ అధికారులకు అదనపు డీజీలుగా పదోన్నతి కల్పించి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోఆర్డినేషన్‌ అదనపు డీజీగా వీకే సింగ్‌, సంక్షేమ విభాగం అదనపు డీజీగా సంతోష్‌ మెహ్రా, ఆక్టోపస్‌ అదనపు డీజీగా సురేంద్రబాబు, రహదారి భద్రత అదనపు డీజీగా సత్యనారాయణ, విజిలెస్స్‌ అదనపు డీజీగా బీఎల్‌ మీనా, హోమ్‌గార్డ్స్‌ అదనపు డీజీగా గోపీకృష్ణ, పోలీస్‌ పర్సనల్‌ విభాగం అదనపు డీజీగా అనురాధ నియమితులయ్యారు.