ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ-20 ట్రోఫీని ఆవిష్కరించిన సెహ్వాగ్‌

ఇండోర్‌: వచ్చే సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలలో శ్రీలంక వేదికగా ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ-20 టోర్నీ జరగనుంది. ఇందుకోసం ఐసీసీ ప్రత్యేకంగా తయారు చేసిన ట్రోఫీని ఇండోర్‌లో ఆవిష్కరించగా, ఇది ఢిల్లీ, ముంబై నగరాలను చుట్టనుంది. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి, డివిజనల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కైలాష్‌ విజయ్‌ వర్గియా , బీజేపీ ఎమ్మెల్యే దృవ్‌ నారాయణ్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా టోర్నీలో భారత జట్టును బీసీసీఐ జాతీయ సెలెక్టర్లు ప్రకటించాల్సి ఉంది. ఈ టోర్నీకి ముందుగానే భారత జట్టు లంక చేరుకొని వన్డే, ట్వంటీ-20 సిరీస్‌ ఆడనుంది.