ఒంటరిగానే ఉన్నాం


దమ్ముంటే చంపండి అన్ర మహిళా మేయర్‌
కాబూల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): తాను తాలిబన్ల కోసమే వెయిట్‌ చేస్తున్నానని.. వచ్చి తనను చంపాలని ఆఫ్ఘనిస్తాన్‌ లో మొదటిసారి మహిళా మేయర్‌ గా ఎన్నికైన జరీఫా గఫారీ అన్నారు. ఆఫ్ఘన్‌ దేశాన్ని తాలిబన్లు ఆదివారం స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలివి. ’నేను నా భర్తతో ఒంటరిగా ఉన్నాను. మమ్మల్ని కాపాడటానికి ఎవరూ లేరు. వీలైతే వచ్చి మమ్మల్ని చంపండి. అష్రఫ్‌ ఘనీ నేతృత్వంలోని నాయకులందరూ పారిపోయారు. ఈ విషయం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నేను ఎక్కడికి వెళ్లగలను? ఈ రోజు నేను నిస్సహాయంగా ఉన్నాను. నేను నా కుటుంబసభ్యుల భద్రత గురించి ఆలోచిస్తున్నాను. అయినా కాబూల్‌ తాలిబన్లకు లోంగిపోదని నేను భావిస్తున్నాను’ అని దేశంలోనే తొలిసారిగా ఎన్నికైన అతి చిన్నవయస్కురాలైన మేయర్‌ జరీఫా అన్నారు.