ఓఎంసీ కేసులో ముగిసిన ఈడీ విచారణ

హైదరాబాద్‌: ఓఎంసీ అక్రమాల కేసులో సీబీఐ అరెస్టు చేసిన నిందితులను చంచల్‌గూడ జైళ్లో ఇవాళ అధికారుల బృందం ప్రశ్నించింది,చంచల్‌గూడ జైళ్లో ఓఎంసీ ఎండీ బి.వి.శ్రీనివాస్‌రెడ్డి గనులశాఖ మాజీ సంచాలకుడు రాజగోపాల్‌,చంచల్‌గూడ మహిళాజైల్లో మాజీ కార్యదర్శి శ్రీలక్ష్మీ వాంగ్మూలాలు నమోదు చేశారు.ముగ్గురు అధికారుల బృందం మనీలాండరింగ్‌ అభియోగాల కోణంలో నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించారు. నేరపూరిత దుష్ప్రవర్తనలకు సంబందించిన అంశాలపై ముగ్గురినీ విచారించారు.